Header Banner

ఢిల్లీలో తరగతిగదుల కుంభకోణం..! ఆప్ మంత్రులపై అవినీతి కేసు నమోదు!

  Wed Apr 30, 2025 15:09        Politics

దేశ రాజధానిలో పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవనీతికి పాల్పడ్డారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రులు మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్‌ (Satyender Jain)లపై అవినీతి నిరోధక విభాగం (ACB) కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారాల సమాచారం ప్రకారం, ఆప్ ప్రభుత్వ హయాంలో 12,748 తరగతి గదులు, అసోసియేటెడ్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. సిసోడియా, జైన్‌లను విచారించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత మార్చిలో ఆమోదం తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-A కింద అనుమతులు మంజూరు కావడంతో దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 12,748 తరగతి గదులు/భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూ.2,892 కోట్లు. ఒక్కో క్లాస్ రూము నిర్మాణానికి రూ.24,86 లక్షల చొప్పున టెండర్లు ఇచ్చారు. గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోగా, భారీగా ఖర్చు చేశారు. గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లను నియమించడం వల్ల సుమారు 5 రెట్లు వ్యయం పెరిగింది.


30 సంవత్సరాలు ఉండేలా తరగతి గదులను కట్టారు. అయితే వాటికి అయిన ఖర్చు మాత్రం 75 ఏళ్లు ఉండేలా అయింది. కాంట్రాక్టులు ఆప్ ఆద్మీ పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నవాళ్లకే దక్కాయి. తరగతి గదుల నిర్మాణం ప్రాజెక్టులో తీవ్రమైన అవకతవకలు జరిగినట్టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గతంలో నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదకపై మూడేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ ఫిర్యాదు తరగతి గదులు, భవనాల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు బీజేపీ ఢిల్లీ విభాగం ప్రతినిధి హరీష్ ఖురానా, బీజేపీ ఎమ్మెల్యే, ఆప్ మాజీ మంత్రి నీల్‌కాంత్ బక్షి తొలుత ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ లాంఛనప్రాయంగా విచారణ ప్రాంభించింది. కాగా, ఇప్పటికే లీగల్ చిక్కులు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌కు ఈ కొత్త కేసు మరిన్ని చిక్కులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే సిసోడియా కస్టడీలో ఉన్నారు. సత్యేంద్ర జైన్ మరో మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు కీలక ప్రకటన! త్వరలో ఏపీకి రానున్న గూగుల్! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #DelhiScam #AAPMinisters #ClassroomCorruption #ManishSisodia #SatyendarJain #ACBInvestigation #CorruptionCase